calender_icon.png 20 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలి

20-08-2025 12:55:39 AM

కొత్తపల్లి,(విజయక్రాంతి): తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా రాజకీయ లబ్ధి కోసం ప్రజలను మభ్యపెడుతోదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రిపై, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులపై, బిజెపి నాయకులపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు.బీసీ బిల్లు, బీసీల రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి  మొదటి నుంచే స్పష్టత లేదని ఈ అంశాలను బిజెపిపై నెట్టే ప్రయత్నం చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నమే తప్ప, బీసీలకు మేలు చేయాలన్న ఉద్దేశం ఆయనకెప్పుడూ లేదని,

బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారో రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా స్పష్టంగా సమాధానం ఇవ్వలేదని, కులగణనలో బీసీల సంఖ్య ఎందుకు తగ్గిందో రేవంత్ రెడ్డి చెప్పాలని, వారు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏవీ రాజ్యాంగబద్ధత పాటించడం లేదని, 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే అందులో 10 శాతం ముస్లింలను కలపవద్దని బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నమని మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్నం ప్రకాష్ ప్రకటనలో అన్నారు.