20-08-2025 12:56:00 AM
శ్రీరంగాపురం, ఆగస్టు 19. మండల కేంద్రంలోని పోచమ్మ అమ్మవారికి బోనాల పండుగను గ్రామస్తులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి, ప్ర త్యేక పూజలు చేశారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తున్నమని గ్రామపెద్దలు తెలిపారు.