25-08-2025 02:11:20 AM
-రిజర్వేషన్ల సాధనకై 25న ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మహాధర్నా
-జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
-18 బీసీ సంఘాల సమావేశం
ముషీరాబాద్, ఆగస్టు 24(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీల పరంగా ఇస్తామని ప్రతిపాదన పూర్తిగా వ్యతిరేకిస్తున్నామ ని, చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశా రు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 18 బీసీ సంఘాల సమావేశం జాతీ య బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా ఎంపీ ఆర్. కృష్ణ య్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు విషయంలో ప్రభుత్వం ఊగిసిలాడుతుందని, గత 8 నెలలుగా ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. గతంలో బీహార్, జార్ఖండ్, తమిళనాడు ప్రభుత్వాలు అనుసరించిన విధానం ఎందుకు అవలంబించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏ ఒక్క విధానం సక్రమంగా లేదని, అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ ఆమో దం పొంది, జీవో జారీ చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే సరిపోయేదన్నారు.
అప్పుడు ఎవరైనా కోర్టుకు వెళితే కోర్టులో గెలిస్తే ఎన్నికలు జరపచ్చని, గెలవకపోతే రాజ్యాంగ సవ రణ కోసం పోరాడవలసి ఉంటుందన్నారు. అలా చేయకుండా రాష్ట్రపతి అని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని రకర కాల వాదనాలతో ప్రజలను తప్పుతోవ పట్టించి కేంద్రంపై నెట్టి జాప్యం చేసి, ప్రజలను మైకంలో ఉంచి చివరకు పార్టీ పరంగా అని మొదటికి తెచ్చారని ఇది సరికాదన్నారు. దీనిని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమ న్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, వారికోసం ప్రయత్నించాలన్నారు.
గవర్నర్ చేత ఆర్డినెన్స్ ఆమోదింప చేసి జీవో జారీ చేయాలని, లేదా అసెంబ్లీలో మరోసారి బీసీ బిల్లు పాస్ గవర్నర్‌కు పంపితే ఆటోమేటిక్ గా పాస్ చేస్తారన్నారు. 25న జరిగే సత్యాగ్రహ దీక్షా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చా రు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు జిల్లపల్లి అంజి, అనంతయ్య, వేముల రామకృష్ణ, మణికంఠ, సి. రాజేందర్, రాజు నేత, నిఖిల్ పటేల్, గోరిగె మల్లేష్ యాదవ్, నిమ్మల వీరన్న, కృష్ణ యాదవ్, కూనూరు నర్సింహ గౌడ్, బర్క కృష్ణ తదితరులు పాల్గొన్నారు.