calender_icon.png 25 August, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్క్రాప్ గోదాంలో అగ్ని ప్రమాదం

25-08-2025 02:13:19 AM

-చర్లపల్లి వైష్ణవి ఎన్‌క్లేవ్ సమీపంలో ఘటన

-భారీగా ఆస్తి నష్టం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): చర్లపల్లి డివిజన్ వైష్ణవి ఎన్‌క్లేవ్ సమీపంలోని ఓ స్క్రాప్ గోదాంలో ఆదివారం రాత్రి 9.30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా గోదాంలో మంటలు చెలరేగి.. దట్టమైన పొగలు వ్యాపించాయని తెలిసింది.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దట్టమైన పొగలతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడ్డారు. కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ భాస్కర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిసింది.