09-02-2025 11:56:44 PM
బీసీ మేధావుల చర్చా వేదికలో ఆర్ కృష్ణయ్య, మేధావులు
ముషీరాబాద్, ఫిబ్రవరి ౯: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌లకు చట్టబద్ధత కల్పించాలని పలువురు వక్తలు అన్నారు. బీ అణిచివేసే దొంగ గణాంకాలను అంగీకరించబోమని, సమగ్ర సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కులగణన సర్వే నివేదికపై సమగ్ర సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌లకు చట్టబద్ధత సాధించడమే లక్ష్యంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన ఆదివారం లక్డికాపూల్‌లో బీసీ మేధావుల చర్చా వేదిక జరిగింది.
ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్, అఖిల పక్ష ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు, వివిధ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడు అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్లను పెం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డి చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచితే బీసీలకు న్యా జరుగుతుందన్నారు. తక్షణమే అసెం సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పి చట్టం చేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్‌ల కోసం పోరాటం చేస్తూనే రాజకీయ అధికారమే లక్ష్యంగా ఉద్యమాన్ని మ ఉధృతం చేయనున్నట్లు తెలిపారు.
మి వక్తలు మాట్లాడుతూ.. సమగ్ర కు సర్వే ప్రకారం బీసీల జనాభా 52 శాతం ఉన్నట్లు పేర్కొనగా, ప్రస్తుత కుల గణనలో బీసల జనాభా 46.25 శాతం ఉన్న చూపించడం ఏమిటని ప్రశ్నించారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల జనాభా పెరుగుతుంటే బీసీ జనాభా శాతం మాత్రం తగ్గి చూపించడం ఏమిటని ప్రశ్నించారు.
సర్వే ఫలితాలను తక్షణమే సమీక్షించి పూర్తి పారదర్శకతతో గణాంకాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సూర్యారావు, మేకల రాములు, లాల్‌కృష్ణ, నీల వెంకటేశ్ ముదిరాజ్, నందగోపాల్, వేముల రామకృష్ణ, జి. అంజి, అనంతయ్య, రాజేందర్, రమాదేవి, రఘుపతి, పగిళ్ల సతీష్, మల్లేష్, నిమ్మల వీరన్న తదితరులు పాల్గొన్నారు.
ఆర్ కృష్ణయ్యకు సన్మానం
తెలంగాణ సంక్షేమ గురుకుల స్కూల్స్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్సెల్సీ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మాదగోని సైదులు, రాష్ట్ర జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి పర్వతాలు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ పాల్గొన్నారు.