calender_icon.png 23 November, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడిపోతున్న మిర్చి ధరలు

10-02-2025 12:00:00 AM

  1. ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రోజు రోజుకూ పతనం
  2. ఆర్థికంగా నష్టపోతున్న రైతులు
  3. కూలీల ఖర్చు కూడా రాని వైనం

ఖమ్మం, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఖమ్మం మిర్చి మార్కెట్‌లో మిర్చి ధరలు రోజు రోజుకూ పతనమవుతున్నాయి. పం  గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు విలవిలలాడిపోతున్నారు. మార్కెట్ ధరను చూసి తలలు పట్టుకుంటున్నారు.  ట్రాన్స్‌పోర్టు ఖర్చులు, కూలీల ఖర్చు కూడా పూడకపోతే ఎలా బతికేదంటూ కండ్ల నీళ్లు పెట్టుకు  2021 సరాసరి రూ.17 వేల ధర లభించింది.

గత రెండేళ్లుగా రూ.20వేలకు పైగానే ధర వచ్చింది. కానీ ఈ ఏడాది  అంతర్జాతీయ మార్కెట్ కారణాల రీత్యా ధర పడిపోయిందంటున్నారు. దీనికి తోడు వ్యాపారులంతా సిండికేట్‌గా మారడంతో అరకొర ధరనే లభిస్తుంది.

ఇదిలా ఉంటే  ఖమ్మం ఏఎంసీ పరిధిలో 18 లక్షల బస్తాలను భద్రపరిచేందుకు 19 కోల్డ్ స్టోరేజీలున్నాయి. ధర లేకపోవడంతో కొంత మంది రైతులు కోల్డ్ స్టోరేజీలను ఆశ్రయించి, సరుకు దాచుకుంటున్నారు. మరికొంత మంది చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న పలంగా ఏదో ధరకు అమ్ముకుని, నష్టపోతున్నారు. 

దైన్యం కోల్పోతున్న రైతులు 

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో గతంలో కంటే ఈసారి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టి పండించిన క్వింటా మిర్చిని రూ.3 వేల నుంచి రూ.6 వేలకు అడుగుతుంటే కన్నీరే దిక్కవుతోంది. జెండా పాటకు, కొనుగోళ్లకు అసలే పొంతనే ఉండటం లేదని రైతులు అంటున్నారు.

జెండా పాట రూ.13 వేలు ఉంటే కొనే సమయానికి రూ.మూడు వేలకు ఇస్తావా? రూ.ఆరు వేలకు ఇస్తావా? ఇస్తే ఇవ్వు లేకుంటే లేదని వ్యాపారులు మొహం మీద చెబుతుండటంతో రైతులకు మింగుడు పడటం లేదు. దైన్యం కోల్పోయి ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 

సాంకేతిక అంశాలు చూపి..

అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చి ధరలు పడిపోయాయనే సాకుతో పాటు సాంకేతిక అంశాలు చూపించి ధరను తొక్కేస్తున్నారు. కనీసం జెండా పాటకు కూడా కొనే దిక్కులేకపోవడంతో రైతులు కుమిలిపోతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు సూర్యాపేట, మహబూ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి భారీగా మిర్చిని తీసుకువస్తుండటంతో మార్కెట్ అంతా మిర్చి బస్తాలతో నిండిపోతుంది.

కానీ ధరలు తగ్గుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. రూ.వంద కోట్లతో మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పే నాయకులు గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థపడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 59 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. దాదాపు లక్షా 18 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఖమ్మం నుంచి ఇతర రాష్ట్రాలకు ,దేశాలకు కూడా మిర్చిని ఎగుమతి చేస్తుంటారు.