10-02-2025 12:00:00 AM
హుజూర్ నగర్, ఫిబ్రవరి 09 : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో వేంచేసిఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వేదపండితుల మంత్రోత్సవాల మధ్య ప్రారంభం అయ్యా యి.
విశ్వాక్షేనపూజ, పుణ్యహావా చనం, అఖండ దీపారాధన, దీక్షావస్రములు, ధ్వజా రోహణం, విష్ణు సహస్ర నామపారాయణం, నిత్య హోమం, బలిహరణ, మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వినియోగం గావించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మెన్ సింగారపు సైదులు, కార్య నిర్వాహణాధికారి నాగేళ్ల శంభిరెడ్డి, కమిటీ సభ్యులు కంచాల వీరారెడ్డి, ఉబ్బపెల్లి సైదులు, పుట్టపాకల మల్లేశ్వరి, ఐతేగాని శివయ్య , భక్తులు పాల్గొన్నారు.