15 May, 2026 | 3:29 PM

Breaking News

అటవీ భూమిలో పశువుల పాకల నిర్మాణం.. గ్రామస్తుల వివాదం   •   బెల్లంపల్లి బస్తీలో పోలీసుల కార్డెన్ సెర్చ్   •   ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •  

ఘనంగా ‘గురు తేగ్ బహదూర్’

01-12-2025 12:30 AM

ఎన్టీఆర్ స్టేడియంలో 350వ అమరవీరుల దినోత్సవం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): సిక్కుల తొమ్మిదవ గురువు, ధర్మ పరిరక్షకుడు గురు తేగ్ బహదూర్ సాహెబ్ 350వ అమరవీరుల దినోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మత స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ వేలాది మంది సిక్కులు ఒకేచోట చేరి ప్రార్థనలు చేశారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో సీతాఫల్‌మండి గురు ద్వారా సాహెబ్ ప్రబంధక్ కమిటీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన విశాల్ కీర్తన్ దర్బార్ కన్నుల పండుగా సాగింది.

రాష్ర్టంలోని అన్ని గురుద్వారాల సహకారంతో నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సం దర్భంగా భాయ్ అనంత్‌వీర్ సింగ్ అమెరి కా, భాయ్ గురుదేవ్ సింగ్ ఆస్ట్రేలియా, జ్ఞాని షేర్ సింగ్ అంబాలా వంటి ప్రముఖ రాగి జాతాలు ప్రవచనకర్తలు విచ్చేశారు. ఈ సం దర్భంగా గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గురు తేగ్ బహదూ ర్ జీని హింద్ కీ చాదర్  అని పిలుస్తారని గుర్తుచేశారు.

అణచివేతకు వ్యతిరేకంగా, ప్రజలు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు కోసం ఆయన పోరాడారని తెలిపా రు. మతం మారడానికి నిరాకరిం చినందు కు 1675లో ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఆయనను చిత్రహింసలకు గురిచేసి శిరచ్ఛే దం చేశారని, ధర్మం కోసం ఆయన చేసిన త్యాగం అజరామరమని కొనియాడారు.

ఆయనతో పాటు భాయ్ మతీదాస్, భాయ్ సతీదాస్, భాయ్‌దయాలా త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సీతాఫల్ మండి గురుద్వారా ప్రబంధక్ కమిటీ చైర్మ న్లు హర్‌పాల్‌సింగ్, కంచన్ సింగ్, ప్రెసిడెంట్ ప్రతాప్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ సింగ్, జనరల్ సెక్రటరీ రంజీత్‌సింగ్, జా యింట్ సెక్రటరీ జగజీత్ సింగ్ పాల్గొన్నారు.