calender_icon.png 8 August, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్రాంత వెటర్నరీ ఆఫీసర్స్ సమావేశం

08-08-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): తెలంగాణ విశ్రాంత వెటర్నరీ ఆఫీసర్స్ రెండవ సంవత్సరపు జనరల్ బాడీ మీటింగ్ వెటర్నరీ కాలేజీలో గురువారం జరిగింది. మొదటగా అధ్యక్షుడు డాక్టర్ అనంతరం స్వాగతం పలికారు. మరణించిన సభ్యుల ఆత్మ శాంతి కొరకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. డాక్టర్ దుర్గయ్య గతేడాది జరిగిన వివిధ కార్యక్రమాలను విపులంగా వివరించారు. ట్రెజరర్ డాక్టర్ రెడ్డి సంవత్సరపు ఎకౌంట్స్ వివరణ ఇచ్చారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ విజయరామరావు జీవిత కాలపు సేవలను గుర్తింపుగా సన్మానం చేశారు. ఈ సమావేశానికి డాక్టర్ జ్ఞాన ప్రకాష్ వైస్ ఛాన్స్‌లర్ పశువైద్య విశ్వవిద్యాలయం, డాక్టర్ మాధురి పశు వైద్య కళాశాల డీన్ హాజరై సభ్యునిదేశించి ప్రసంగించారు. ఈ మీటింగ్‌లో కొన్ని తీర్మానాలను కూడా చేశారు. ఆరుగురు సభ్యులను విశిష్ట సేవలు అందించినందుకు వైస్ ఛాన్‌లర్ సన్మానించారు. డాక్టర్ దుర్గయ్య వందన సమర్పణతో సమావేశం ముగిసింది.