08-08-2025 12:00:00 AM
నిజామాబాద్, ఆగస్ట్ 7 (విజయక్రాంతి): ఏటా తమ స్కూల్‌లో నిర్వహించే ఆటల పోటీలను పురస్కరించుకొని ఆర్‌బీవీఆర్‌ఆర్ హై స్కూల్‌లో గురువారం ఇంట్రా మ్యూరల్ గవర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల స్థాయి స్పోర్ట్స్‌ను ప్రారంభించారు. వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, ఖోపూpఖో, కబడ్డీ, కరాటే, యోగావిద్యతో పాటు వివిధ రకాల క్రీడలను విద్యార్థులకు తెలియజేసేలా విద్యార్థులతో క్రీడలు నిర్వహించారు.
కార్యక్రమానికి సొసైటీ గౌరవ అధ్యక్షుడు ఏ ప్రవీణ్‌రెడ్డి, సెక్రటరీ వెంకటరమణారెడ్డి, ఆర్బీవీఆర్‌ఆర్ హైస్కూల్ చైర్మన్ పీ జగత్ రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి, ఈసీ మెంబర్ దేవేందర్ రెడ్డి, విద్యాకమిటీ సభ్యులు ఉమామహేశ్వర్ రెడ్డి, సర్వోత్తమ్‌రెడ్డితోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు వీణారెడ్డి, అడిషనల్ హెడ్‌మాస్టర్ పీ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.