28 July, 2026 | 2:36 AM

తెలంగాణ చరిత్రకు రేవంత్ తూట్లు

30-05-2024 01:45 AM

దాసోజు శ్రవణ్ 

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): ప్రజల జీవితాల్లో మార్పు తెస్తానని అధికారం చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ చరిత్రను, ఆనవాళ్లును తుడిచివేసే పనిలో పడటం అవివేకానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ సర్కా రు గుర్తులు మార్చడం తుగ్లక్ చర్య అని, భవిష్యత్తులో రేవంత్‌రెడ్డి ము ఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవా ల్సి వస్తే ఆతరువాత వచ్చే కొత్త సీఎం మరో కొత్త లోగో తేవాలా? అంటూ బుధవారం ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ప్రజా పాలన అంటే పిల్లలాటగా ఉందని, ఒక వేళ మా ర్చాల్సిన అవసరమే  ఉంటే ప్రజలను ఒప్పించి, మెప్పించాలని సూ చించారు. ముఖ్యమంత్రి, తన ము ఠా సభ్యుల సొంత నిర్ణయం కాకూదని పేర్కొన్నారు. అన్ని వర్గాలతో సంప్రదింపులు చేసి నిర్ణయం తీసుకోవాలని, లేదంటే అసెంబ్లీలో చర్చ జరపాలని సూచించారు.