రేవంత్‌కే లైడిటెక్టర్ పెట్టాలి
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగా ఓటుకు నోటులో దొరికిన వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణభవన్‌లో బుధవారం మాట్లా డుతూ.. కేసీఆర్ లైడిటెక్టర్ పెడితే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని రేవంత్‌రెడ్డి మాట్లాడటం అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆయనకే లైడిటెక్టర్ పెడితే అసలు విషయాలు బయటకు వస్తాయని దుయ్యబట్టారు. మాజీ సీఎం కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని, చంద్రబాబు, వైఎస్ పాలనలో జరిగిన ఎన్‌కౌంటర్లు ఫలానా వాళ్లు చెబితే చేశామని ఎవరైనా పోలీసు అధికారులు చెప్తారా అని ప్రశ్నించారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫోన్‌ట్యాపింగ్ చేసిన విష యం తెలిసినా దానిని పట్టించుకోలేదని గుర్తుచేశారు. లీకు వార్తలు ఇలాగే కొనసాగితే న్యాయపరంగా ముందుగా వెళ్తామని చెప్పారు. అభియోగాలు ఎప్పడూ చట్ట పరిధిలో అంగీకరించబోరని, ఏ ఉత్తర్వులు, ఏ ప్రాతిపదికన జరిగాయన్నది న్యాయస్థానంలో నిర్ధారణ అవుతుందని పేర్కొన్నారు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకా రం ప్రభుత్వంలోని అధికారులు నిర్ణయం తీసుకొని ట్యాపింగ్ చేయవచ్చని తెలిపారు. బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని, నీళ్లు లేక పంటల ఎండలేదని, కరెంటు కోతలు లేవని గుర్తుచేశారు. ప్రగతిభవన్ ముందున్న కంచెను తొలగించి రాక్షస ఆనందం పొందారన్నారు.






