27-11-2025 12:00:00 AM
46 జీవోను తక్షణమే రద్దు చేసి సర్పంచ్ ఎన్నికలు వెంటనే వాయిదా వేయాలి
లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన
42 శాతం బీసీ రిజర్వేషన్ల సాదన సమితి
ముషీరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): బీసీలను సీఎం రేవంత్ రెడ్డి నమ్మించి వంచించారని 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆరోపించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 46 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాదన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విషారదన్ మహారాజ్ మాట్లాడుతూ కామారెడ్డి 42 శాతం బీసీ రిజర్వేషన్ల డిక్లరేషన్ అమలు చేయక పొగ చెల్లని జీవోలు ఇచ్చి న్యాయస్థానంలో సిగ్గు తీసుకోవడమే గాక పార్టీ పరువును బజార్లో పెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. బీసీలను వంచన చేసి జీవో 46 తీసుకొచ్చి బీసీలను రాజకీయంగా గొంతు కోస్తున్నారని మండిపడ్డారు.
వేంటనే 46జీవోను రద్దుచేసి సర్పంచ్ ఎన్నికలు వెంటనే వాయిదా వేయాలనీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మెన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ఇతన ఇస్ సెధారి ఉత్నే భాగ్య దారి అని ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ ఏ ఒక్కటి నెరవేర్చకుండా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి డిల్లీ తీసుకెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర బీసీ బిల్లుపైన చర్చించకుండా పార్ల మెంటు లో బీసీ బిల్లు పెట్టే ఏ ఒక్క కార్యాచరణ నేటికి చేపట్టక పోవడం దుర్మార్గమన్నారు.
ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం రేవంత్ రెడ్డి బిసిలకు చేశారని, బీసీలను చైతన్యం చేసి ప్రభుత్వం భరతం పడుతామని హెచ్చరించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ 46జీవోనును వెంటనే రద్దు చేసి సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేయాలని, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్లు చైర్మన్లు తక్షణమే రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి అగ్రకుల ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ ఛైర్మన్ ఎస్ దుర్గయ్య గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదన్నారు. మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి బీసీలను నట్టేట ముంచి బీసీలను విద్యా, ఉద్యోగ, రాజకీయ పరంగా అణచి వేసే రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా కోన సాగే అర్హత లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బైరు శేఖర్, అంబాల నారాయణ గౌడ్, ఎలికట్టే విజయకుమార్ గౌడ్, సింగం నాగేశ్వర్ గౌడ్ తదితరలు పాల్గొన్నారు.