27-11-2025 12:00:00 AM
వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్యకలాపాలు తీవ్రంగా నిర్వీర్యమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజే పీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ కార్యాలయం లో నూతన కమిషనర్ V. అభిలాష్, మేనేజర్ సత్యనారాయణ లను బీజేపీ జిల్లా అధి కార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
పట్టణం లోని ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాం తాలు మినహా అనేక కాలనీల్లో పారిశుధ్య పనులు సక్రమంగా జరగకపోవడంతో చెత్త పేరుకుపోవడం, మురికి కాలువలు మూసుకుపోవడం, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడం వం టి సమస్యలు ఉత్పన్నమై ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని పేర్కొన్నారు. ఇందిరా కాలనీ తెలంగాణ నగర్, కొత్తూరు బంగారుజాల ప్రాంతాలు, నవభారత్ ఏరియాలో అనేక కాలనీలు దారుణంగా ఉన్నాయని తెలిపారు.
వర్షాకాలంలో వచ్చిన నీరు, మట్టి పేరుకుపోవ డంతో డ్రైనేజీలు పూర్తిగా మూసుకుపోయాయని వారు వివరించారు.అలాగే, పట్టణంలో జనాభా పెరిగి నా మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సంఖ్య పెంచకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో శుభ్ర త పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య సిబ్బందిని తక్షణమే పెంచాలని వారు డిమాండ్ చేశారు.
కోతులు వీధికుక్కలు పందులతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
పాల్వంచ పట్టణంలో కోతులు, వీధికుక్కలు, పందులు విపరీతంగా పెరిగి ప్రత్యేకం గా పిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు.ప్రధాన రహదారులపై మాత్రమే కుక్కలను పట్టడం జరుగుతుండగాకాలనీల్లో తిరిగే వీధికుక్కలను పట్టించుకోకపోవడంకో తులు ఇళ్ల పైకప్పులు, వీధుల్లో విపరీతంగా తిరగడంపందులు చెత్త ప్రాంతాల్లో తిరిగి కాలనీల్లో అసౌకర్యం కలిగించడంవంటి సమస్యలు తో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురిఅవుతున్నారు.
కోతులను పట్టుకొని అడవు ల్లో వదిలేయాలని, వీధికుక్కలు, పందులను పట్టుకొని పట్టణానికి దూరంగా వదిలేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీకి విజ్ఞ ప్తి చేశారు.రోడ్లపై దుమ్ము సమస్య ప్రమాదాలకు దారితీస్తుందని ముఖ్యంగా ములకల పల్లి రోడ్ (దమ్మపేట సెంటర్ శ్రీనివాస కాలనీ) మీద భారీగా దుమ్ము నిలిచి వాహ న దారులు,ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
పరిశ్రమలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రధాన రహదారిపై రోజూ దుమ్ము పేరుకుపోతోందని పేర్కొన్నారు. రోడ్ స్వీపింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ వినియోగం చాలా తక్కువగా ఉందని మండిపడ్డారు. యంత్రాలను వాడి రోడ్లను శుభ్రం చేయాలని వారు డిమాండ్ చేశారు.
పాల్వంచ పట్టణంలోని అన్ని కాలనీల్లో
మురికి కాలువలను వెంటనే,శుభ్రపరచాలి,చెత్తను తొలగించాలి, బ్లీచింగ్ పౌడర్ను రెగ్యులర్గా చల్లాలి, పారిశుధ్య సిబ్బందిని పెం చాలి,వంటి అత్యవసర చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులుకొత్తగూడెం మున్సిపల్‌కా ర్పొరేషన్ అధికారులను కోరారు. పాల్వంచ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మానుపురి ప్రభాకర్,జిల్లా కాన్సిల్ మెంబెర్ రాజు, మాజీ ప ట్టణ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి మాదారపు లక్ష్మణ్, రొయ్యల రమేష్, పరిమి శ్రీనివాస్, నాగేంద్ర బాబు, అశోక్, నాగరాజు, శ్రీను కిరణ్, క్రాంతి, రుద్ర , శ్రీనుగౌడ్, హాథిరామ్ తదితరులు పాల్గొన్నారు.