13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్

26-03-2026 02:04 AM
  1. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు కావాలని అనుకుంటున్నారేమో!
  2. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మహిళలు, యువతకు ఎక్కువ టికెట్స్
  3. చేరికల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): దక్షిణాది, ఉత్తరాది పేరుతో రేవంత్ రెడ్డి దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, రాజ్యాంగ పదవిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని రేవంత్‌కు రాహుల్ గాంధీ చెప్పరా?, రాహుల్ గాంధీని తీసేసి ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు కావాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారేమో అన్నారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజ కవర్గానికి చెందిన పలువురు నాయకులు రాంచందర్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇప్పటికే జూబ్ల్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్‌ను హిందూ ముస్లింగా విభజించిందని, డి లిమిటేషన్‌తో ఎవరికి వివక్ష జరగదన్నారు.

మొట్టమొదటిసారిగా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కాబోతుందన్నారు. మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్‌కి ఇష్టం లేదని, అందుకే డి లిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్నారని, స్టాలిన్ మీటింగ్‌కు కేటీఆర్, రేవంత్ రెడ్డి కలిసి హాజరయ్యారని, తాము కాదు కదా? అన్నారు. ఎవరు ఒక్కటి అనేది ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నిక ల్లో మహిళలు, యువత, చదువుకున్న వారి కి ఎక్కువ టికెట్స్ కేటాయిస్తామన్నారు. పెట్రోల్, డిజీల్ కొరత లేదని, సోషల్ మీడి యా ప్రచారాన్ని నమొద్దని ఆయన కోరారు. పెట్రోల్ డీలర్స్‌తో కలిసి కాంగ్రెస్ కృత్రి మ కొరత సృష్టిస్తుందని ఆరోపించారు.