calender_icon.png 4 August, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి, కేసీఆర్ మోసగాళ్లు

04-08-2025 12:00:00 AM

-20 నెలలు గడిచినా రేవంత్ పెన్షన్లు పెంచలేదు 

- ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అడగడం లేదు 

- పెన్షన్లు పెంచకుంటే సీఎం రాజీనామా చేయాలి

-పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 

గజ్వేల్, ఆగస్టు 3: వృద్ధులకు, దివ్యాంగుల కు పెన్షన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా సీఎం రేవంత్‌రెడ్డి పెన్ష న్లు పెంచడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నా డని ఎద్దేవా చేశారు.

ప్రజలను పట్టించుకోని వీరిద్దరూ దేశంలోనే నంబర్‌వన్ మోసగాళ్ల ని మండిపడ్డారు. గజ్వేల్‌లో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల, వృద్ధుల సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్ననాటి నాటి నుంచి పెన్షన్ దరఖాస్తులు   పెం డింగ్‌లో ఉన్నాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పేదల గురించి కేసీఆర్ అడగడం లేద న్నారు.

ఇప్పటికైనా మౌనం వీడాలని సూచించారు. ప్రతిపక్ష నాయకుడి పాత్రలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి పెన్షన్‌దారులు రూ.40,000 చొప్పున రూ.20 వేల కోట్లు నష్టపోయారని చెప్పారు. పెన్షన్లు చెల్లించాల్సిన డబ్బుతోనే రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ఖర్చు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు హామీ ఇచ్చిన నాటి నుంచే రూ.6 వేల చొప్పున దివ్యాంగులకు పెన్షన్లు చెల్లిస్తున్నారని, తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పెన్షన్లు పెంచలేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పింఛన్లు ఇవ్వకుండా మోసం చేస్తే, కెసిఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యాడని, వీరికి ఓటేయొద్దని పిలుపునిచ్చారు. పింఛన్లు పెంచకుంటే రాజీనామా చేయాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.

పెన్షన్ల పెంపు సాధన కోసం ఆగస్టు 13న హైదరాబాదులో భారీ సభను నిర్వహిస్తున్నారని, సభకు వృద్ధులు, దివ్యాంగులు, పెన్షన్ దారులంతా రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కామల్ల భూమయ్య, ఎంఎస్‌పి జాతీయ నాయకులు మంద కుమార్, జిల్లా కొ ఇన్‌చార్జి మల్లిగారి యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మొక్కపల్లి రాజు మాదిగ,  ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగే మహేష్ మాదిగ, జిల్లా అధ్యక్షుడు మొక్కపల్లి రాజు మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు బుడిగే మహేష్ మాదిగ, జిల్లా కార్యదర్శి ఉబ్బని ఆంజనేయులు, టిజిడిజే ఏసి బాబు, దుర్గయ్య పాల్గొన్నారు.