04-08-2025 12:00:00 AM
ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 3 (విజయక్రాంతి) సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జ యంత్ కుమార్ తో పాటు పాత్రికేయులు అందరు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చె ప్పుకున్నారు. ఈ వేడుకల్లో సీనియర్ పాత్రికేయులు ఊరడి మల్లికార్జున్ ను ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువా మెమొంటోతో ఘనంగా సత్కరించారు అనంతరం ప్రెస్ క్లబ్ సీనియ ర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం,
మా ట్లాడుతూ.. టీవీ నారాయణ. మానవ స ంబంధాలలో అత్యంత విలువైన స్నేహాన్ని గౌరవించే ఒక ప్రత్యేకమైన వేడుక అని వారు పేర్కొన్నారు. స్నేహం యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం మన జీవితాలపై సానుకూల ప్ర భావాన్ని గుర్తు చేస్తుందన్నారు.. మనకున్న ప్రేమను,స్నేహం అంటే కేవలం సరదాగా గడపడం మాత్రమే కాదు, కష్టాల్లో తోడుగా ఉండటం, సంతోషంలో పాలుపంచుకోవ డం, ఒక మంచి స్నేహితుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడని వారు పేర్కొన్నారు.
జీవిత ప్రయాణంలో స్నేహితులు మనల్ని మానసికంగా, భావోద్వేగంగా బలోపేతం చే స్తారనీ ,మన బాల్య స్నేహితులను, కళాశాల స్నేహితులను, వృత్తిపరమైన స్నేహితులను గుర్తు చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశమని, ఆధునిక యుగంలో సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న స్నేహితులనైనా పలకరించి, శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక మంచి మాధ్యమంగా మారిం దన్నారు.సంస్కృతి, సంప్రదాయాలు వేరై నా,
స్నేహం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిపే ఒక అద్భుతమైన బంధం అనేవా రు అన్నారు. ఫ్రెండ్షిప్ డే స్ఫూర్తితో, మనం మన స్నేహాన్ని మరింత బలపరచుకోవడానికి, దానిని ఎప్పటికీ నిలిపి ఉంచడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు బొడ్డు పరుశరాములు, మాజీ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్ కు మార్, కార్యవర్గ సభ్యులు చౌటపల్లి వెంకటేశం, ముండ్రాయి శ్రీనివాస్, పాత్రికే యులు పాల్గొన్నారు.