calender_icon.png 4 August, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాభాసగా అర్బన్ బ్యాంకు సమావేశం

04-08-2025 12:00:00 AM

  1. పాత పాలకవర్గం సభ్యత్వం తొలగింపు

హైకోర్టు నిబంధనల మేరకు తొలగించామన్న చైర్మన్ విలాస్ రెడ్డి

కుట్రలో భాగమేనన్న మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్

కరీంనగర్, ఆగస్టు 3 (విజయ క్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం రసాభాసాగా కొనసాగిం ది. గత సమావేశం కోరెం లేక వాయిదా పడడంతో ఆదివారం రెవెన్యూ క్లబ్ లో సభను నిర్వహించారు. బ్యాంకు అధ్యక్షుడు గడ్డం విలాస్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. పాలకవర్గ సభ్యులతోపాటు సభ్యు లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైకోర్టు తీర్పును (21.549/2025) సభ్యుల ముం దు ఆమోదం కోసం చైర్మన్ ఉంచారు.

ఈ తీర్మాణం ప్రకారం 2007 నుంచి 2017 వర కు ఉన్న పాలకవర్గ సభ్యుల సభ్యత్వం తొలగించేందుకు తీర్మానం చేశారు. సభ్యత్వం తొలగించబడ్డవారిలో అర్బన్ బ్యాంకు మా జీ చైర్మన్ కర్ర రాజశేఖర్, సభ్యులుగా కొనసాగిన ఎండీ ఫసియుద్దీన్, లక్ష్మణ్ రాజు, వ రాల జ్యోతి, దేశ వేదాద్రి, అనరాస్ కుమార్, కె రవి, సరిళ్ల ప్రసాద్, నజీర్, తాటికొండ భా స్కర్, బాశెట్టి కిషన్, బొమ్మరాతి సాయికృష్ణ,

దునిగంటి సంపత్, చాడ వీరారెడ్డి, ముద్దసాని క్రాంతిలు ఉన్నారు. వీరిని సభ్యత్వం నుండి శాశ్వతంగా తొలగించడానికి సభ ఆమోదం పొందినట్లు గందరగోళం మధ్య చైర్మన్ విలాస్ రెడ్డి ప్రకటించారు. అలాగే బైలా నెంబర్ 2కు సంబంధించి గతంలో ఉన్న బైలా ప్రకారం వ్యవహారిక విస్తీర్ణం 10 కిలోమీటర్లుగా సభ ఆమోదం తెలిపింది. ఎక్కడైతే బ్రాంచి ఓపెన్ చేస్తారో ఆ బ్రాంచి చుట్టు పక్కల 10 కిలోమీటర్లు ఉంటుంది. 

ఈ సమావేశంలో ప్రస్తుత సభ్యులైన మడుపు మోహన్, ముక్క భాస్కర్, రేగొండ సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, రవీందర్, నాగుల సతీష్, గంజి అంజయ్య, బ్యాంకు సీఈవో మునుగొండ శ్రీనివాస్లు పాల్గొన్నారు. అయితే సర్వసభ్య సమావేశ తీర్మాణాన్ని బ్యాంకు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ తప్పుపట్టారు.