ఒకే ఫ్లెక్సీలో రేవంత్‌రెడ్డి, కేసీఆర్
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది పాత సామెత.. అలాగే..అధికార, ప్రతి పక్షం వేరు వేరు అనేది అంతే నిజం. అయితే మ హబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు వేరువేరు పార్టీల్లో ఉంటూ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వేరు వేరు వార్డుల నుండి వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు.
శీలం భవాని బీఆర్‌ఎస్ మద్దతుతో, గండి శ్రావణి కాంగ్రెస్ మద్దతుతో గెలిచారు. ఈ క్రమంలో గ్రామంలో బోనాల పండుగ సం దర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒకే ఫ్లెక్సీ లో ఇరువైపులా తమ పార్టీల అధినేతలైన కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఫోటోలను పైభాగంలో చేర్చి, దిగువన తమ ఫోటోలు చేర్చి ఏర్పాటు చేశారు. ఓకే ఫ్లెక్సీలో ఓవైపు గులాబీ రంగు, మరోవైపు మూడు రంగులతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.






