13 August, 2026 | 4:00 AM

దంత సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

13-08-2026 12:00 AM

ఏరియా డెంటల్ చారిటబుల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): దంత సమస్యలను మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభంగా, త్వరగా, తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్యే రూట్ కెనాల్, పన్ను తొలగింపు లేదా ఇంప్లాంట్ వరకు వెళ్లొచ్చు. పళ్లలో పుచ్చు, చిగుళ్ల నుంచి రక్తం రావడం, నోటి దుర్వాసన వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని ఏరియా డెంటల్ చారిటబుల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సునీల్ కుమార్ సూచించారు. ‘ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్ష చేయించుకోవడం, రోజూ పళ్లుచిగుళ్ల శుభ్రతపై శ్రద్ధ పెట్టడం ద్వారా పెద్ద సమస్యలను ముందుగానే నివారించవచ్చు. పళ్లను కాపాడుకోవడానికి చేసే ఖర్చు ఖర్చు కాదు.. ఆరోగ్యంపై పెట్టే పెట్టుబడి’ అని చెప్పారు.