31 May, 2026 | 9:52 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు?

11-04-2026 09:35 PM

- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి

ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 28 నెలల పాలనలో హానికర మద్యానికి ఆ శాఖకు మంత్రిని కేటాయించి భవిష్యత్తు విద్యార్థుల చదువులకు ప్రత్యేక మంత్రిని కేటాయించకపోవడం సిగ్గు చేటని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ లక్షలాది మంది విద్యార్థులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు  విద్యను వ్యాపార రంగంగా మార్చారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డికి విద్యారంగం బలోపేతం కావాలని ఆతృత చిత్తశుద్ధి ఉంటే విద్యారంగానికి ప్రత్యేక మంత్రిని కేటాయించాలన్నారు. ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ ఫీజులు వసూలు చేస్తున్నది ఎంత? సిబ్బందికి ఇచ్చే జీతాలు ఎంతో విద్యాసంస్థల నోటీస్ బోర్డ్ పై పెట్టే విధంగా చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ప్రభుత్వం పై మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు.