17-07-2025 12:07:16 AM
10 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
చేవెళ్ల, జూలై 16:ప్రభుత్వ భూమి కబ్జాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధి అ జీజ్ నగర్ లోని 176 సర్వే నెంబర్ లో సు మారు 10 ఎకరాల చుట్టూ అక్రమంగా ప్రీ కాస్ట్ పెన్సింగ్ వేస్తున్నట్టు తహసీల్దార్ గౌత మ్ కుమార్ కు సమాచారం అందింది. వెం టనే స్పందించిన ఆయన కూల్చి వేయాలని సిబ్బందిని ఆదేశించారు.
దీంతో మండల గిర్దవర్ రాజేష్ సిబ్బందితో కలిసి స్థానిక పో లీసుల సహకారంతో అక్కడికి వెళ్లి జీసీబీ సాయంతో ప్రీకాస్ట్ వాల్ ను కూల్చివేయించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడు తూ .. ప్రభుత్వ భూముల జోలికొస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కూ ల్చివేతల్లో రెవెన్యూ సిబ్బంది భాస్కర్, చిరంజీవి తదితరులుపాల్గొన్నారు.