17-07-2025 12:08:32 AM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ అధ్యక్షునిగా కడార్ల శంకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన డీలర్ల సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఫెర్టిలైజర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కటకం అశోక్ ఆధ్వర్యంలో మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఈ కమిటీలో మండల అధ్యక్షులుగా కడార్ల శంకర్, ఉపాధ్యక్షులుగా సామ బాల నాగేందర్, ప్రధాన కార్యదర్శిగా బసాని కృష్ణమూర్తి, కోశాధికారిగా ఆకుతోట రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే మన సంక్షేమంగా మహాదేవపూర్, పలిమెల మండలాల డీలర్లు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సిడ్స్, పర్టిలైజర్స్ నాణ్యమైనవి సరఫరా చేయాలనీ అన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన మండల కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన కడార్ల శంకర్ మాట్లాడుతూ మా ఎన్నికకు సహకరించిన రెండు మండలాల డీలర్లకు జిల్లా అధ్యక్షులు కటకం అశోక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం జిల్లా అధ్యక్షులకు మండల అధ్యక్షులకు సన్మానం చేశారు.