calender_icon.png 19 February, 2026 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులకు సన్మానం

19-02-2026 01:24:44 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా యు.సునీల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎంఏ. ఫిరోజ్ ఎన్నికైన నేపథ్యంలో కలెక్టరేట్ డిపిఆర్‌ఓ కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ, అన్ని విభాగాల ఉ ద్యోగుల న్యాయమైన, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి తెలంగాణ రెవెన్యూ స ర్వీస్ అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో డిపిఆర్‌ఓ పి. రా జేంద్ర ప్రసాద్, కలెక్టరేట్ ఏవో పవన్  కు మార్, పర్యవేక్షకులు మదన్ గోపాల్, రా జేష్, దామోదర్, సిబ్బంది రవీందర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.