2 July, 2026 | 3:56 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్ష సమావేశం

17-06-2025 08:24 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిజిహెచ్ ఆసుపత్రిలో మంగళవారం ఆస్పత్రి సూపర్డెంట్ ఫరీదా ఆధ్వర్యంలో ఆరోగ్య మిత్రలతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి జిల్లా మేనేజర్ సత్యనారాయణ(District Manager Satyanarayana) తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ సేవ ద్వారా ప్రజలకు అందుతున్న ఆరోగ్య మిత్రుల ద్వారా ఆరా తీశారు.

అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు నిరంతరం సేవలు అందించే  విధంగా ఆరోగ్య మిత్రులకు దిశ నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం జి జి హెచ్ హాస్పిటల్ సూపర్డెంట్, ఆరోగ్య మిత్ర లతో ఆరోగ్య శ్రీ సేవలు అందించే సమస్యల పైన చర్చించారు. అనంతరం రిజిస్టర్లను, రికార్డులను  పరిశీలించారు. ఈ సమావేశంలో జి జి హెచ్ హాస్పిటల్స్ సూపర్డెంట్ ఫరీదా బేగం, ఉమ్మడి జిల్లాల టీం లీడర్లు అల్లావుద్దీన్ ,యశ్వంత్, జిల్లాల వారీగా ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు.