calender_icon.png 31 January, 2026 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీనిధి ప్రగతి సాధన గురించి సమీక్ష

31-01-2026 07:58:31 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): సెర్ప్ ఐకెపి ద్వారా అమలు చేయబడుతున్న కార్యక్రమాలపై గ్రామ సంఘ సహాయకులతో సమీక్ష సమావేశాన్ని నాగిరెడ్డిపేట మండల సమైక్య  కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈఆర్థిక సంవత్సరంలో సాధించవలసిన బ్యాంకు లింకేజీ మరియు స్త్రీనిధి ప్రగతి సాధన గురించి సమీక్షించడం జరిగింది. అంతేకాకుండా లోకోస్ యాప్లో ఆజీవీక రిజిస్టర్ ఎంట్రీ చేయాలని మిగతా అన్ని కార్యక్రమాలు సకాలంలో ఆన్లైన్లో ఎంటర్ చేయాలని,

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో పూర్తి పారదర్శకంగా ఉండి లక్ష్యసాధనలో ముందుండాలని వివోఏలను కోరడం జరిగింది. అనంతరం రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ప్రభుత్వం చే ఉత్తమ ఉద్యోగిగా గుర్తించబడిన ఐకెపి ఎపిఎం రాంనారాయణ గౌడ్ని,మండల సమాఖ్య పాలకవర్గం మరియు సిబ్బంది ఘనంగా సన్మానించివారి సేవలను కొనియాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత,కార్యదర్శి మంజుల, సీసీలు దత్తు,నారాయణ, రషీద్,సావిత్రి,అకౌంటెంట్ రాజు,ఆపరేటర్ రవి మరియు విఓఏలు పాల్గొన్నారు.