నిర్వాసితులకు అండగా ఉంటా..
సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు.
ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు బియ్యం, నగదు అందజేత.
చారకొండ: ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని అధైర్యపడొద్దని వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు(Veldanda Single Window Chairman Jupally Bhaskar Rao) అన్నారు. శనివారం మండలంలోని శిరుసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ భూముల్లో హైకోర్టు ఉత్తర్వులతో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులను పరామర్శించి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యంతో పాటు రూ.10 వేలు నగదు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతాదృక్పథంతో ప్రభుత్వం ఆలోచించించి బాధితులకు పునరావాసం కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఇండ్లు కోల్పోయిన వ్యక్తులు ధైర్యం కోల్పోకుండా మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి రవితేజ, మాజీ సర్పంచులు శారద, సాయికుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, నాయకులు కమలాకర్ రావు, రమేష్, సలీం, శ్రీశైలం, చండీశ్వర్, శ్రీను, మధు తదితరులు పాల్గొన్నారు.






