calender_icon.png 21 June, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకే తలమానికంగా కరీంనగర్ డెయిరీ

21-06-2025 02:55:34 PM

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి నంజయ్ కుమార్

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ డెయిరీ(Karimnagar Dairy) తెలంగాణకు తలమానికంగా నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) అన్నారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వారికి కరీంనగర్ డెయిరీవారు హాట్ మిల్క్ తోపాటు పాల ఉత్పత్తులను సరఫరా చేయడంపై అభినందించారు. స్టాల్ ను సందర్శించిన బండి సంజయ్ కరీంనగర్ డెయిరీ చేస్తున్న ఉత్పత్తులను అడిగి తెలుసుకొని తెలంగాణకే కాదు ఉమ్మడి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా ఉత్పత్తులను కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా కరీంనగర్ డెయిరీ వారు అందించిన హాట్ మిల్ ను యోగాసనం అనంతరం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్రావు, కరీంనగర్ డెయిరీ ఎండీ శంకర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.