11-10-2025 12:10:44 AM
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : సమాచార హక్కు చట్టం 2005ను అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్టిఐ 2005 వారోత్సవాలలో భాగంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, డివిజన్ ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ఆర్టిఐ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు సమాచార హక్కు చట్టం 2005 అవగాహన కార్యక్రమం నిర్వహించి ఆర్టిఐ చట్టం వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను మరియు చట్టం అమలు తీరు, ఆర్టిఐ చట్టంలో ఉన్న అంశాలను వివరించారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా అన్న కలెక్టర్ లోకల్ బాడీ చందర్ నాయక్, డిఆర్‌ఓ మధు మోహన్, ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, సెక్షన్ ఆఫీసర్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పిఐఓలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిలో సహ చట్టం వార్షిక వారోత్సవాలు
ఎల్లారెడ్డి అక్టోబర్ 10 (విజయక్రాంతి) : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక డి.ఎస్.పి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005, 20వ వార్షిక వారోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సహ చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎం ఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు , కేక్ కట్ చేసి రాష్ట్ర డైరెక్టర్ సలీం కు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సి.ఐ. దొర గారి రాజారెడ్డి, లింగంపేట్ మండల సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా సలహాదారులు దండగుల లింగమయ్య,,షేక్ మదర్ పాష, జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఇంతియాజ్, ప్రతినిధులు మహమ్మద్ మసూద్, అర్ యాదగిరి గౌడ్, శ్రీకాంత్,మోహన్ రెడ్డి, షేక్ అయూబ్ స్థానిక డిఎస్పి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.