calender_icon.png 11 October, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెయిలీ వేజ్ వర్కర్స్‌కు పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలి

11-10-2025 12:10:00 AM

  1. జి.ఒ 64 అమలు నిలిపివేయాలి

29 వ రోజుకు చేరిన రిలే దీక్షలు 

తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ డిమాండ్ 

టేకులపల్లి, అక్టోబర్ 10,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం గంగారం ఆశ్రమ పాఠశాలలో వర్కర్లు చేస్తున్న రిలే దీక్షలు శుక్రవారానికి 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి ప్రశాంత్ సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు.

వర్కర్లకు ఇప్పుడు చెల్లిస్తున్న వి దంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్క్యులర్ (గెజిట్) ప్రకారం యధావిధిగా వేతనా లు చెల్లించాలని, గతంలో టి ఆర్ యస్ ప్ర భుత్వం కాలంలో 2021 జూన్ 15 న ఆర్థిక శాఖ విడుదల చేసిన జి.ఒ 64 ను అమలు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసారని, దీని ఫలితంగా వర్కర్ల వేతనాలు బాగా తగ్గుతున్నాయన్నారు.

జి.ఓ. 64 నిలిపివేయాల ని, అదేవిధంగా 212 జి.ఒ ను సవరించి 2014 నాటికి 5 సంవత్సరాల సర్వీస్ వున్న వారందరిని పర్మి నెంట్ చేస్తూ, మిగిలిన వ ర్కర్లకి టైంస్కేల్ ఇవ్వాలన్నారు. జీఓ నెం. 64తో భారీగా వేతనాలు తగ్గిపోయి కార్మికుల జీవితాలు బారంగా మారనున్నాయన్నారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 2021లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం.64ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం వలన కార్మికుల వేతనా లు నెలకు రూ. 4 వేల నుండి 16 వేలవరకు తగ్గుతున్నాయని, ఈ పద్ధతి సరి కాదని ఔట్సోర్సింగ్ విదానం రద్దు, పెండింగ్ వేతనాలు చెల్లించుటకు ట్రేజరీలకు తగు ఆదేశా లు ఇవ్వాలి గత సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలి,కొత్త మెనూ వల్ల పెరిగిన పనిభారానికి అనుకుణంగా కార్మికుల సంఖ్యను పెంచి, పూర్తి కాలం పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలన్నారు.

మరణించిన కార్మికుల కుటుంబసభ్యులను డైలీవేజ్ వర్కర్లుగా నియమించాలని, విధ్యార్థులతో పాటు కార్మికులకు కూడా 2 జతల యూని ఫాం మరియు ఐడి కార్డులు , 12 నెలలకు వేతనాలు (దసరా సెలవులు, సంక్రాంతి, వేసవి సెలవెలకు కూడా) చెల్లించాలిని,10 లక్షల ప్రమాద భీమా కల్పించాలి, రిటైర్మెంట్ బెన్ఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలని, మట్టి ఖర్చులకు రూ. 50 వేలు, వేతనంతో కూడిన వారాంతపు సెలవులు అమలు చేయాలని కొరారు. కార్యక్రమంలో ద్వాలీ, సీతమ్మ, బిజ్జ లక్ష్మయ్య, కోరం సమ్మక్క, కంగల సరిత, జోగ ముత్తమ్మ పాల్గొన్నారు.