calender_icon.png 11 October, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

11-10-2025 12:11:55 AM

ఖమ్మం, అక్టోబర్ -10 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మె రుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ను కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ పి.హెచ్.సి. లలో పని చేసే ప్రతి సిబ్బంది అటెండెన్స్ ఆన్ లైన్ చేసి 100 శాతం మానిటరింగ్ చేయాలని అ న్నారు.

ప్రసవ సమయంలో తల్లి మరణాల కు సంబంధించి కేసులు పరిశీలిస్తే రెండవ ఏ.ఎన్.సి. చెక్ అప్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకున్నట్లు తేలిందని, దీనికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. గత సంవత్సర కాలం గా ప్రతి ఆశా కార్యకర్త పరిధిలో మొదటి, రెండు ఏ.ఎన్.సి. చెక్ అప్ ప్రైవేట్ ఆసుపత్రులలో జరిగిన కేసులు పరిశీలించి రిపోర్టు అందించాలని, దీనికి గల బాధ్యులపై చర్య లు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ఆశా కార్యకర్తలతో రెగ్యులర్ గా సమావేశాలు పె ట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ ల కు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించి న ప్రైవేట్ ఆసుపత్రులపై కూడా చర్యలు తీ సుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆశా కార్యకర్తలు రెగ్యులర్ గా తమ పరిధిలో ఇం టింటి సర్వే చేస్తూ గర్బీణి మహిళల వంద శాతం ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉన్న వసతులు ప్రైవేటు ఆసు పత్రులలో లేవని, ప్రభుత్వ ఆసుపత్రులలో అధికంగా ప్రసవాలు జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సి సెక్షన్ డెలివరీలను నివా రించాలని అన్నారు. అధికంగా సి సెక్షన్ జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల పై నిఘా పెట్టాలని, ప్రతి సెక్షన్ ఆపరేషన్ పై ఆడిట్ రిపోర్ట్ ఉండాలని అన్నారు.

జిల్లాలో అనవసరంగా సి సెక్షన్ డెలివరీలను చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఆశా కార్యకర్తలు ప్రతి గర్భిణీ స్త్రీ ను ఫాలో అప్ చేస్తూ ఉచితంగా మన ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవా లు జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి పి. హెచ్.సి. పరిధిలో వంద శాతం పిల్లలకు టీ కాలు వేయించాలని, వైద్య అధికారులు టీకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి ఆశా కార్యకర్త ఫాలో అప్ చేయాలని అన్నారు.

పతి పి.హెచ్.సి. పరిధిలో ఎన్.సి.డి. సర్వే పూ ర్తి చేసి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చే యాలని, వైద్య అధికారులు తమ పరిధిలో ఆశా కార్యకర్తలతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు. ఎన్.సి.డి. సర్వె నిర్వహణలో ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం, ఎం.ఎల్.హెచ్.పి. పాత్ర ఎంత ఉండాలో నిర్దేశించుకోవాలని అన్నారు.

ప్రతి పి.హెచ్.సి. పరిధిలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉం చాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, వివిధ ప్రోగ్రాం అధికారులు, వైద్య అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.