12-11-2025 08:05:47 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): తనకు రావాల్సిన ఆస్తికోసం కన్నతల్లి ఇంటిముందే కన్న కొడుకు తన భార్య బిడ్డలతో కలిసి తనకు రావాల్సిన భూమిలో వాటా ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది.బాధితుడు,గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన కన్నెబోయిన ఉపేందర్ కు వంశపారంపర్యంగా వస్తున్న భూమిలో వాటా ఇవ్వకుండా తనను తన కన్నతల్లి మంగమ్మ,తమ్ముడు కిరణ్ పంపకం చేయకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం తనకు రావాల్సిన భూమిలో వాటా కోసం తన భార్య ఇందు,తన పిల్లలతో కలిసి తల్లి ఇంటి ముందు నిరసనకు దిగాడు.దీంతో గ్రామస్తులు ఉపేందర్ కు మద్దతుగా నిలిచారు.తనకు వంశపారంపర్యంగా వస్తున్న భూమిలో వాటా రాని ఎడల తనకు తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని,అధికారులు వెంటనే తనకు న్యాయం చేయాలని ఉపేందర్ వేడుకున్నాడు.