calender_icon.png 13 December, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలి తీవ్రతతో గుండె పోటు ప్రమాదం

10-12-2025 02:10:11 AM

అవగాహన సదస్సులో ‘మెడికవర్’ వైద్యులు

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాం తి): చలి తీవ్రతతో నరాలు కుంచించుకపోయి గుండెపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం మెడికవర్ ఆసుపత్రిలో గుండె జబ్బు లు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సి న జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  మిగతా సీజన్ల కంటే చలికాలంలో నీళ్లు తక్కువగా తాగడం వల్ల రక్తం చిక్కబడ డం, ఆస్తమా, స్మోకింగ్‌తో ఊపిరితిత్తుల దా రులు మూసుకుపోయి గుండెపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.

రక్తం చిక్కబడడం, రక్తస రఫరాలో ఇబ్బందుల వల్ల గుండెకు ఆక్సిజన్ అందక గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందన్నారు. గుండె వ్యాధిగ్రస్తులు ప్రమాదకర చలిలో బయటకు వెళ్లకూడదని సూచించారు.  షుగర్, కిడ్నీ, బీపీ, కేన్సర్, టీబీ వ్యాదితో బాధపడే వారు పొల్యూషన్‌కు దూరంగా ఉంటూ తగినంత నీరు తాగుతూ, వ్యాయామం చేస్తూ వైద్యుల సూచనలు పాటించాలన్నారు.

మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన  అవగాహన కార్యక్రమంలో కార్డియా లజిస్టులు డాక్టర్ వాసుదేవరెడ్డి, డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు, క్రిటికల్కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్‌రెడ్డి,  సూపరింటెం డెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, ఆపరేషన్ మేనేజర్ సాయిచరణ్, హెచ్‌ఆర్ మేనేజర్ ఈశ్వర్ పాల్గొన్నారు.