10-12-2025 02:11:43 AM
హైదరాబాద్, డిసెంబర్ ౯(విజయక్రాంతి): కంట్రీక్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ ఆధ్వర్యంలో ఆసియాలోనే అత్యంత భారీ స్థాయి నూతన సంవత్సర వేడుకలను ‘వార్ ఆఫ్ డీజేస్’ ను నిర్వహిస్తున్నట్టు కంట్రీక్లబ్ సీఎండీ వై. రాజీవ్‌రెడ్డి ప్రకటించారు. రసూల్ పూరలో ని పోలీస్ హాకీ స్టేడియంలో డిసెంబర్ 31న జరుగనున్న ఈ వేడుకకు సంబంధించి మంగళవారం బేగంపేట కంట్రీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీసీహెచ్‌హెచ్‌ఎల్ చైర్మన్ వై. రాజీవ్ రెడ్డి కంట్రీ క్లబ్ ఆసి యా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు.
నటి, ఫోక్ డ్యాన్స్ ఐకాన్ సిమ్రాన్ అహుజా కూడా హాజరయ్యారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలు వనీష్, ఎక్సటసీతో ఈ సందర్భంగా లైవ్ డీజే ప్రదర్శనతో ఉర్రూతలూగించారు. సీసీహెచ్‌హెచ్‌ఎల్ చైర్మన్ వై. రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా దేశంలోని ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, సూరత్, కొల్హాపూర్‌లోని తమ క్లబ్‌లు, రిసార్ట్‌లలో ‘ఆసియాలోనే అతిపెద్ద న్యూ ఇయర్ బాష్ 2026’ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సిటీకి సంబంధించి తమ ప్రధాన వేడుక, ‘వార్ ఆఫ్ ది డిజేస్’నగరంలోని పోలీస్ హాకీ స్టేడియంలో జరుగనుందని, దీనిలో ప్రముఖ తారల ప్రదర్శనలు, డీజే సెట్స్‌తో పాటు టాలీవుడ్ తారల డాన్స్ ప్రదర్శనలు, నేపథ్యగాయకులు మ్యూజికల్ నైట్ ప్రధాన ఆకర్షణగా పేర్కొన్నారు.