calender_icon.png 11 December, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుభేండ్రు భట్టాచార్యపై చర్యలు తీసుకోవాలి

10-12-2025 02:08:44 AM

ఎస్‌ఆర్‌నగర్‌లో బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాం తి): హిందూ దేవి దేవతలను అవమాన పరుస్తూ మాట్లాడిన మాజీ ఐఏఎస్ అధికారి సుభేండ్రు భట్టాచార్యపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ అన్నావ జుల సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణు లు స్టుపిడ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హిందూమతంలో దేవతల పేరు చెప్పి బ్రాహ్మణులు దోపిడీకి పాల్పడుతున్నారని, హిందూ దేవతలను అవమాన పరుస్తూ ఆయన మాట్లా డిన మాటలపై తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదు చేసి న వారిలో బిజెపి అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్, నాయకులు కప్పర ప్రసాదరావు, ధార్మిక సెల్ కో కన్వీనర్ నిరంజన్ దేశాయ్,  దడిగం రామ్ సుధాకర్‌శర్మ తదితరులు ఉన్నారు.