11 May, 2026 | 2:47 PM

పాఠశాలకు ఆర్‌ఓ ప్లాంట్ విరాళం

15-09-2025 06:40 PM

కుభీర్: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.30 వేల విలువచేసే శుద్ధ జల ప్లాంటును ఏర్పాటుచేసి  తన ఉదారతను చాటుకున్నాడు స్థానిక వ్యాపారి రెడ్డిశెట్టి ఆనంద్. తన పుట్టినరోజును  పాఠశాలలో విద్యార్థుల నడుమ  జరుపుకోవాలన్న సంకల్పంతో సోమవారం ఆయన పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ బడులు బలోపేతం  అవుతున్నాయని అన్నారు. విద్యార్థులకు శుద్ధ జలం అందించాలనే సదుద్దేశంతో దాత రెడ్డిశెట్టి ఆనంద్, రెడ్డిశెట్టి నాగేశ్వర్ లను ఉపాధ్యాయులు విద్యార్థులు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.