11 May, 2026 | 1:28 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

రైతులను నిండా ముంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

15-09-2025 06:46 PM

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): రైతులకు యూరియా ఇయ్యకుండా నిండా ముంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారాలి అని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. సోమవారం మున్సిపాలిటీ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతాంగానికి మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధర్నా నిర్వహించి, ఎమ్మార్వో దిలీప్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రైతులు యూరియా అందక ఇబ్బందులు పడుతుంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు అని హెద్దేవా చేశారు.

రైతులపై నిర్లక్ష్య వైఖరిని వీడి రైతులకు యూరియా అందించాలన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో రైతులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు సరైన బుద్ధి చెప్తారని తెలిపారు. రైతులకు సరిపడా యూరియా అందించకపోతే ట టిఆర్ఎస్ ప్రభుత్వం  చూస్తూ ఊరుకోదని, అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.