15-09-2025 06:38:00 PM
నిర్మల్,(విజయక్రాంతి): ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవాని ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ సెప్టెంబర్ 15 నాటికి 41వ స్థాపిక దినోత్సవం సోమవారం జరుపుకున్నారు. నిర్మల్ డిసిసి క్యాంపు కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షురాలు తన లక్ష్మి నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ వాసవి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
నిర్మల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తన లక్ష్మి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడుతున్న మహిళా కాంగ్రెస్కు నేటికీ 40 సంవత్సరాలు పూర్తయింది మహిళా శక్తి అనేది దేశానికే బలం రాబోవు రోజుల్లో మహిళా కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తామని లక్ష్మీ గారు అన్నారు ఆమె వెంట సోను మండల ప్రెసిడెంట్ రేఖాగౌడ్ మరియు సీనియర్ నాయకురాలు లక్ష్మి జ్యోతి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు