calender_icon.png 21 August, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

28-06-2024 10:23:06 AM

బెంగళూరు: కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తున్న క్రమంలో గుండెనహళ్లి సమీపంలో పుణె - బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని టెంపూ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే  మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాద సమయంలో వ్యానులో 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.