calender_icon.png 21 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరుగుతున్న కుక్కల దాడులు.. 8 ఏళ్ల బాలుడు మృతి

28-06-2024 02:24:02 PM

సంగారెడ్డి : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు వరుసగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ మహిళపై 15 కుక్కలు పైగా దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడులు పెరిగిపోతుండడంతో ఇకనైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. తాజాగా సంగారెడ్డి జాల్లాలోని పటాన్ చెరు మండలంలో విషాదం చోటుచేసుకుంది.

ఇస్నాపూర్ లో శుక్రవారం కుక్కలు కరిచి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. విశాల్ అనే బాలుడు బహిరంగ మలవిసర్జనకు వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు మృతిచెందాడు. ఇదిలా ఉండగా.. ముత్తంగిలో 7 నెలల చిన్నారిని కూడా కుక్కలు తీవ్రంగా గాయపరిచారు. చిన్నారి హుటాహుటిన పటాన్ చేరు ఆసుపత్రికి తరలించారు.