calender_icon.png 21 August, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ

28-06-2024 10:03:23 AM

కోరుట్ల: జుగిత్యాల జిల్లాలోని కోరుట్ల మున్సిపల్ పరిధిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మున్సిపల్ కార్మికులు ఇవాళ ఉదయం రోడ్లను ఊడుస్తూ.. చెత్తను ట్రాక్టర్ లో వేస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి మున్సిపల్ కార్మికులు తప్పించుకున్నారు. లారీ ఢీకొట్టాడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనతో పలు వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు  ట్రాఫిక్ ను క్లియర్ చేసి ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.