7 July, 2026 | 1:43 AM

షేక్ పేట పైవంతెన పిల్లర్‌ను ఢీకొని నుజ్జు నుజ్జయిన కారు

02-08-2024 10:19 AM

హైదరాబాద్‌: రాయదుర్గం ఎఫ్ డీడీఐ వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. విద్యార్థి మృతి చెందింది. షేక్ పేట పై వంతెన పిల్లర్ ను ఢీకొని కారు నుజ్జునుజ్జయింది. రోడ్డు ప్రమాదంలో బీబీఏ విద్యార్థి గోవుల చరణ్(19) అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు గంటల పాటు శ్రమించి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు యూసుఫ్ గూడ రహ్మత్ నగర్ కు చెందిన చరణ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.