calender_icon.png 25 September, 2025 | 11:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం...

25-09-2025 09:36:06 AM

సంఘటనలో భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు 

హైదరాబాదు నుంచి కడపకు వెళ్తుండగా.. ఆగి ఉన్న డీసీఎం ఢీ కొట్టిన బైక్

అలంపూర్ :  గద్వాల జిల్లా ఉండవల్లి మండలం హైదరాబాద్ -కర్నూలు జాతీయ రహదారిపై(Hyderabad-Kurnool National Highway) పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న డీసీఎంను  బైక్  ఢి కొట్టడంతో ఒకరు మృతి  చెందారు. హైదరాబాద్‌ నుండి కడపకు బైక్ పై దంపతులు ఇద్దరు కలిసి వెళ్తుండగా టోల్ ప్లాజా సమీపంలో ప్రమాదానికి గురయ్యారు.భర్త మస్తాన్ స్పాట్ డెత్ అయ్యాడు. భార్యను తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి  తరలించినట్లు హైవే సిబ్బంది తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి నిద్రమత్తులో ఉండటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది