25-09-2025 09:00:52 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని రైతులందరికి తెలియ జేయునది ఈరోజు యూరియా సప్లై లేదని ఏవో నాగరాజు తెలిపారు. రైతులు పనులు వదులుకొని మండలానికి యూరియా కోసం వర్షానికి వచ్చి ఇబ్బందులు పడవద్దని అన్నారు. మళ్ళీ యూరియా మండలానికి రాగానే రైతు లందరికి సమాచారం అందించి డిస్ట్రిబ్యూషన్ చేస్తామని అన్నారు. మండలంలోని రైతులు ఇట్టి విషయాన్ని గమనించి వ్యవసాయ అధికారులకు సహకరించాలని కోరారు.