25-09-2025 09:34:13 AM
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని(Nizamabad district) పలు మండలాల్లో గురువారం భారీ వర్షం(Heavy rains) కురుస్తోంది. డిచ్ పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్ పల్లి, మోపాల్, సిరికొండ, నిజామాబాద్ గ్రామీణ మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి, మంజీర నదులకు భారీ వరద నీరు చేరుతోంది. కందుకుర్తి వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అంతరాష్ట్ర వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులు వంతెన వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ- మహారాష్ట్ర(Telangana and Maharashtra) మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.