16-10-2025 11:10:36 PM
ఒకరి మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు..
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన..
అబ్దుల్లాపూర్‌మెట్: పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్‌పై రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలైయిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా కొంట మండలం, ఎర్రబోర్ చెందిన మడ్కందేవా(36) టీఎస్-12-యూసీ-7847 బోర్వెల్ వాహనంపై కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పెద్ద అంబర్పేట్ గ్యారేజీ నుంచి జల్పల్లి వెళ్తున్న క్రమంలో ఓఆర్ఆర్ వాటర్ ఫాల్స్ వంతెన వద్ద బోర్వెల్ వాహనం ముందు భాగంలో రైట్‌సైడ్ టైరీ పగిలింది. ఇదే బోర్వెల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నసయ్యద్ ఫజల్‌కు సమాచారమివ్వడంతో ఆయన టీఎస్–13–యూడీ–2024లో ఆటో ట్రాలీ మరో టైర్‌ను తీసుకొచ్చి.. బోర్వెల్ వెనుక ఆపి టైర్ మారుస్తున్న క్రమంలో ఘట్కేసర్ నుంచి బొంగుళూరు వైపు వెళుతున్న ఏపీ–39–యూసీ నెంబర్ గల మహేంద్ర గుడ్ వాహనం ఆటో ట్రాలీ వెనుక భాగంలో బలంగా ఢీకొట్టంది.
దీంతో మడ్కందేవాకు తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడిక్కడే మృతి చెందాడు. సూపర్వైజర్ సయ్యద్ ఫజల్‌కు మరో వ్యక్తికి సయ్యద్ ముజ్తాబా గాయాలు కావడంతో వెంటనే హయత్‌నగర్‌లోని నీలాద్రి దవాఖాను తరలించి ప్రధమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం సంతోష్ నగర్‌లోని ఓవైసీ దవాఖానకు తరలించారు. ఏపీ రాష్ట్రం కర్నూల్‌కు చెందిన మహేంద్ర గుడ్ వాహనం డ్రైవర్ పాండ్ల నాగరాజు అజాగ్రత్త నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్ వి.అశోక్‌రెడ్డి తెలిపారు.