16-10-2025 11:06:23 PM
బీసీ రిజర్వేషన్ సాధన బిక్ష కాదు బీసీల హక్కు..
బీసీ వెల్ ఫెర్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రస్తుతం రాష్టంలో అధికారాన్ని అనుభవిస్తున్న ఉన్నత వర్గాలకు చెందిన రెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీల ఓట్ల వల్లే అన్న సంగతి రెడ్లు గుర్తు ఎరగాలని నేషనల్ బీసీ వెల్ఫేర్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాలులో 42% బిసి రిజర్వేషన్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జనాభా ప్రాతిపదికన అందాల్సిన రిజర్వేషన్ హక్కుగా పొందుతున్నామని ఎవరు దయాదాక్షిన్యాలు వారేసే భిక్ష కాదన్నారు. ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన కోసం చేపట్టిన బంధు విజయవంతం చేయాలని అన్ని వర్గాల వారు సహకరించాలని పిలుపునిచ్చారు. వారితో పాటు పాలమూరు జిల్లా అధ్యక్షులు నిరంజన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్, అరవింద చారి, లక్ష్మన్, తిరుపతయ్య, సుధాకర్ గౌడ్, నిరంజన్ యాదవ్, మహేష్ గౌడ్, బాల పీరు తదితరులు ఉన్నారు.