17-10-2025 08:30:29 AM
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది.
సివిల్ జడ్జి మారుతి ప్రసాద్.
గరిడేపల్లి,(విజయక్రాంతి): పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి విద్యనే పదునైన ఆయుధం అని,ఏది సాధించాలన్న విద్యుత్ తోనే సాధ్యమని హుజూర్‌నగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ అన్నారు.గురువారం కీతవారిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(A) ప్రకారం ప్రతి పౌరుడికి సమాన విద్యా,ఉద్యోగావకాశాలు లభించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని,ఇక్కడ చదువుకునే విద్యార్థులు ప్రతిభతో ఉన్నత స్థానాలను సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలో చదివితే జీవిత సత్యాలను తెలుసుకుంటారు.
కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా పేదవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నామని వివరించారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చనగాని యాదగిరి,ఉపాధ్యక్షులు జక్కుల నాగేశ్వరరావు,ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు,ఏజీపీ సురేష్ కుమార్,న్యాయవాదులు ఉప్పల గోపాలకృష్ణమూర్తి,భూక్య నాగేశ్వరరావు,చనగాని మహేష్,షేక్ సైదా హుస్సేన్,బుడగే నరేష్,దాసరి మోహన్,జుట్టు కొండ సంధ్య,రమణారెడ్డి,వట్టికూటి అంజయ్య,బానోతు శ్రీను నాయక్,పెండెం సాయిరాం గౌడ్,సాముల సురేందర్ రెడ్డి,కీత వెంకటేశ్వరరావు,కోర్టు సూపరింటెండెంట్ పానుగోతు సైదా నాయక్,ఎస్ఐ నరేష్,ప్రధానోపాధ్యాయులు సువర్ణ,ఉపాధ్యాయులు పిట్టల నాగేశ్వరరావు,గుండు సతీష్,న్యాయశాఖ సిబ్బంది,పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.