16-10-2025 11:13:23 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు కలుగుతుందని గరిడేపల్లి మండల తహసిల్దార్ బండ కవిత అన్నారు. మండలంలోని కీతవారిగూడెం, గడ్డిపల్లి గ్రామాల్లో ఆయా ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘాల చైర్మన్లు జుట్టు కుండ సత్యనారాయణ, గంటా సుధాకర్ రెడ్డి తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఖరీఫ్ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మి ప్రయోజనం పొందాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి నారాయణస్వామి, ఆర్ఐలు ప్రవీణ్, రాంబాబు, గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్,గడ్డిపల్లి సహకార సంఘం ఉపాధ్యక్షులు శానం వీరభద్రయ్య, పంచాయతీ కార్యదర్శి జానకి, పిఎసిఎస్ డైరెక్టర్లు బొల్లేపల్లి రామనాథం, మంగళగిరి కృష్ణ, కామల్ల సుకన్య, సీఈవో నిడిగొండ కనకయ్య, సంఘం సిబ్బంది కాట్రేవుల లక్ష్మయ్య, దొంగరి శ్రీను, పాలెల్లి అంజయ్య, నకిరికంటి సాయిలు, కేశ గాని హరీష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.