calender_icon.png 10 January, 2026 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో రహదారి భద్రత అవగాహన ర్యాలీ

09-01-2026 06:56:27 PM

మంథని,(విజయక్రాంతి): న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో మంథని పట్టణంలో రహదారి భద్రత అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని  అదనపు జెఎఫ్ సీఎం  సుధారాణి, సీనియర్ న్యాయవాదులు చందుపట్ల రమణ కుమార్ రెడ్డి, హరిబాబు, శశిభూషణ్ కాచె తో పాటు గోదావరిఖని 2-టౌన్ సీఐ ప్రసాద్ రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్ఐలు శ్రీనివాస్, రవికుమార్,  సాగర్ లతో కలిసి   అంబేద్కర్ చౌక్, మంథనిలో న్యాయవాదులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రజలకు రహదారి భద్రత ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో  కోర్టు సిబ్బంది సైతం పాల్గొన్నారు.